కరోనా విజృంభణ..ప్రధాని మోడీకి జగన్‌ లేఖ !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే… కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బూస్టర్ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అంతే కాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలా మందిని కోవిడ్‌ నుంచి రక్షించే అవకాశం ఉంటుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌.