మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది

చింతపల్లి మండలం మెట్టు మహంకాళిమాత పాదాల వద్ద 2 రోజుల క్రితం లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. జిల్లా ఎస్పీ రాజేశ్వరి కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించారు. హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్ తండాకు చెందిన జయేందర్ నాయక్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించనున్నారు.