జిల్లాలో ఈ నెల 17 నుంచి 25 వరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిఈడు పిల్లల సర్వేను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి శుక్రవారం తెలిపారు. 17 నుంచి జరిగిన సర్వేలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు 80 మంది బాలురు 92 మంది బాలికలు, 17 నుంచి 19 సంవత్సరాల లోపు 20 మంది బాలురు పది మంది బాలికలను గుర్తించినట్లు వెల్లడించారు. బడి బయట వారందరిని త్వరలో పాఠశాలల్లో ఉపయోగించనున్నట్లు చెప్పారు.