పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం కొల్లూరులో రూ.1,422.15 కోట్లతో సర్కారు నిర్మించిన 15,600ల అతిపెద్ద గృహ సముదాయం వచ్చేనెలలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేసి గృహ ప్రవేశాలు చేయించనున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు.