ఓదెల మండలంలోని జీలగుంటలో ట్రాక్టరు అదుపు తప్పి SRSP కాలువలో పడడంతో డ్రైవరు కాసూరి రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రోజులాగే వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో పడింది. రాజయ్య మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి SI లక్ష్మణ్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ : కాలువలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్
-