కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపాల్ మృదులపై మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్లు బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తూ కడిపికొండ నుంచి భట్టుపల్లి వైపు వెళ్తుండగా కేంద్రీయ పాఠశాల తెరచి ఉండడం చూసి ఎస్సైకి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1, 2లకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నట్లు గమనించి, కేసు నమోదు చేశారు.