మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓయువతి గత 8 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. అయితే మహేష్ ఆమెను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దమవుతుండటంతో సోమవారం అతని ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేపట్టింది. యువతి కుటుంబ సభ్యులు ఇంటి ముందు బైఠాయించడంతో గుండెపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.