వరంగల్: లోక్ అదాలత్ లో భారీగా కేసుల పరిష్కారం..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌లో భారీగా పెండింగ్‌ కేసులు పరిష్కారమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,261 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు తెలిపారు. ఇందులో 59 సివిల్‌ కేసులు, 97 మోటార్‌ ప్రమాదబీమా కేసులు, 3,803 క్రిమినల్‌ కేసులు, 6,302 కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.