
జనగామ: కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్ని తండా వద్ద రామన్న గూడెం గ్రామానికి చెందిన శంకరయ్య(55) అనే వ్యక్తి సోమవారం లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.