సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు

భూపాలపల్లి డిపో నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. డిపో నుంచి రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు హన్మకొండ, ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు, అక్కడి నుంచి తిరిగి కాళేశ్వరం వరకు రోజూ 15 బస్సులను నడుపుతున్నట్లు వివరించారు.