త్వరలో వరంగల్ MGMఆస్పత్రిలో పిల్లల కోవిడ్ కేర్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఈ యూనిట్లో మొత్తం 42 పడకలలో 34 సాధారణ పడకలు కాగా, ఎనమిది ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలకొల్పిన ఈ యూనిట్‌ను, త్వరలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.