
త్రిపురారం మండలం కంపసాగర్ చిన్న చెరువులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గందమళ్ల అజయకుమార్ మంగళవారం తెలిపారు. చిన్న చెరువులో చేపల వేటకు వెళ్లిన జాలర్లు కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 35-40 ఏళ్ల మద్య ఉంటుందని, మెరూన్ కలర్ టి షర్ట్, బ్రౌన్ కలర్ జీన్ పాయింట్ ధరించాడన్నారు.