పద్మశ్రీ అవార్డు రావడంపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు

-

పద్మశ్రీ అవార్డు రావడంపై గరికపాటి నరసింహారావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తన కు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని…తన ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలు అని పేర్కొన్నారు గరికపాటి నరసింహా రావు. పద్మ శ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని.. కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని వెల్లడించారు గరికపాటి నరసింహారా వు.

ప్రవచనాల్లో, ప్రసంగాల్లో తల్లి, భార్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. యువత దైవత్వం పై శ్రద్ధ కలిగి ఉండటం శుభపరిణామమని చెప్పారు. నా ప్రసంగాల వల్ల కొంతమంది నొచ్చుకొని ఉండొచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను ప్రసంగాలు చేయనని.. నాది విషయ గత విమర్శ కాదని స్పష్టం చేశారు గరికపాటి నరసింహారావు. నేను ఎవరికి భయపడను. ఎవరి సన్మానాల కోసమో, ఎవరి సత్కారాల కోసమో నేను ప్రసంగాలు చేయనని హెచ్చరించారు. ఇంకా ప్రవచనకర్తలు తయారు కావాలి. ఇప్పటి వరకు ఉన్న ప్రవచనకర్తల మధ్య ఆరోగ్యకరమైన పోటీనే ఉందని చెప్పారు గరికపాటి నరసింహారావు.

Read more RELATED
Recommended to you

Latest news