పస్తులుండి జీవితాన్ని నెగ్గుకువచ్చిన వారే చాలా మంది ఉన్నారు. అగ్నిపథ్ కారణంగా చాలా మందికి ఆగ్రహం ఉంది. కోపం ఉంది. ఎవరి కోపాన్ని అయినా గుర్తించి అర్థం చేసుకోవడంలోనే సిసలు విచక్షణ జ్ఞానం ఒకటి వెలుగులోకి వస్తుంది. లేదా అదే గొప్పనైన భావజాలం అయి తీరుతుంది కూడా ! కోపాన్ని అర్థం చేసుకోవడంలోనే సిసలు జీవితం ఉంది. ఇప్పుడు యువతకు తప్పక కోపం ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న టెస్టుల సంగతి ఏంటి అని అడిగితే వాళ్లు ఏం సమాధానం చెప్పడం లేదు. కానీ దేశాన్ని నడిపే యువత ఈ పాటి ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా విచారకరం.
ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ అప్రమత్తమై ఆమదాలవలస రైల్వే స్టేషన్ మొత్తం కలియదిరిగి, అనుమానితులను ఆపి ప్రశ్నించారు. ఇదే విధంగా మరో చోట ఇంకో చోట కూడా ఖాకీలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చాలా మంది అమాయకులపై కూడా కేసులు నమోదు అయ్యాయని సికింద్రాబాద్ ఘటనకు సంబంధించి అందుతున్న వివరం. మరి! దేశాన్ని నడిపే యువశక్తి ఎందుకని నిర్వీర్యం అయిపోతోంది.
ఇప్పటికీ ఇంటి దగ్గర పనిచేయండి..మీకేం కాదు ఆఫీసుకు రావక్కర్లే !|సేలరీ పది నుంచి 20 వేల వరకూ ఇస్తాం అని చెప్పే కంపెనీలు ఉన్నాయి. ఆర్మీ మాత్రమే ఉద్యోగం కాదు. ఒక సివిలయన్ దేశానికి ఎన్నో విధాలుగా సేవ చేసి, దేశ భక్తి చాటుకున్న రోజులు ఉన్నాయి. ప్రభుత్వాలు నమోదు చేసిన ప్రగతి కన్నా సామాన్యుల విజయాలే గొప్పవి. కనుక మీరంతా మీ శక్తిని వినియోగించండి.. వృథా చేయకండి అని అంటున్నారు వైజ్ఞానిక వేత్తలు. యువ శక్తి నిర్వీర్యం అయిపోతున్నప్పుడు ఎక్కడో ఓ చోట మేమున్నాం అని చెప్పే, దారి చూపే సంస్థలు ఉన్నాయి. అదిగో మహీంద్ర అంటున్నారు. అగ్నివీరులకు మేం సాయం అందిస్తాం అని ! ఇంతకూ ఈ వ్యాసం అగ్నిపథ్ కు సంబంధించి మద్దుతు ఇవ్వడమో, ఇవ్వక పోవడమో గురించి కాదు..ముందు మీరు శక్తిని వినియోగించుకోవడం అన్నది ప్రధానం అని చెప్పడం.. నా దేశ యువత బాగుంటే బాగుపడితే సంతోషించే తల్లులను చూడాలని మహీంద్ర లాంటి పెద్ద పెద్ద కంపెనీల అధిపతులు కోరుకుంటున్నారు.
ఇప్పుడు అన్నీ ప్రయివైటేజేషన్ అనే సిద్ధాంతం లో ఉన్నాయి. వీటిని వ్యతిరేకించాలి. కానీ సమూహాన్ని కాపాడుకునే శక్తులు మాత్రం అదుపు తప్పకూడదు.. మళ్లీ ట్రైన్ వస్తుంది మీ కోసం..మిమ్మల్ని ఎక్కడికో గమ్య స్థానాలకు చేర్చి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి.. అది మీ జీవితం.. వృథా చేయకండి.. ఇది మీ కాలం పదిలం చేసుకోండి..మళ్లీ ఎస్పీ రాధిక డ్యూటీలో ఉన్నారు. శ్రీకాకుళం యువతకు నాలుగు మంచి మాటలు చెబుతున్నారు.. వారికే కాదు ఈ దేశ యువతకు కూడా ఆమె మాటలు శిరోధార్యం కావాలి. గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అంటే ఆర్మీ మాత్రమే కాదు! అరచేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి..వాటి ప్రతిఫలమే మీ జీవితం..మీ కష్టం..మీ గమ్యం.