తాప్సీ ‘శభాష్ మిథు’ ట్రైలర్‌పై సచిన్, గంగూలీ ప్రశంసల వర్షం..

-

టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘శభాష్ మిథు’. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ లైఫ్ స్టోరి ఆధరంగా తెరకెక్కిన ఈ సినిమ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఈ సినిమా ట్రైలర్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, గంగూలీ స్పందంచారు.

ఈ సినిమా వచ్చే నెల 15న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ట్రైలర్ చూసిన సచిన్ టెండుల్కర్..తాను సినిమా చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. గుండెలను హత్తుకునేలా ట్రైలర్ ఉందని, మిథాలీ రాజ్ మిలియన్ల మందికి స్ఫూర్తి అని తెలిపారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం ‘శభాష్ మిథు’ ట్రైలర్ స్పై స్పందించారు. శభాష్ మిత్తు..అని ట్వి్ట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్టార్ క్రికెటర్స్ అయిన సచిన్, గంగూలీ మద్దతుతో సినిమాకు మంచి ప్రచారం లభించింది.

శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిథాలీ రాజ్ గా కనిపించడం కోసం తాప్సీ చాలా కష్టపడింది. ప్రొఫెషనల్ క్రికెటర్ గా కనిపించడం కోసం చాలా శ్రమించింది. అదంతా కూడా వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కరించబడుతుందని మేకర్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version