క‌రోనా క‌ష్టాల‌కు.. విశాఖ క‌న్నీటికి.. మ‌నిషే కార‌ణం..!!

-

ప్ర‌పంచంలో జ‌రుగుతున్న అన‌ర్థాల‌కు, ప్ర‌కృతి విప‌త్త‌ల‌కు.. నిజంగా.. 100 శాతం మ‌నిషే కార‌ణం.. మనిషి చేస్తున్న త‌ప్పులే ప్రాణ న‌ష్టానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు పెర‌డం, అకాల వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు… అన్నీ మ‌నిషి చేస్తున్న త‌ప్పుల వ‌ల్లే సంభ‌విస్తున్నాయి. ఆఖ‌రికి మ‌నుషులకు వ‌స్తున్న వ్యాధుల‌కు కూడా మ‌నిషే కార‌ణ‌మ‌వుతున్నాడు. మారిన మ‌నిషే అనేక అన‌ర్థాలకు కార‌ణ‌మ‌వుతున్నాడు. మ‌నం చేస్తున్న త‌ప్పుల వ‌ల్లే మ‌న ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతోంది.

స‌మాజంలో క‌డుపుకాలి ఒక‌డు త‌ప్పు చేస్తే.. కడుపు నిండి ఒక‌డు త‌ప్పు చేస్తాడు. ఒక‌డు దాచుకుని, మ‌రొక‌డు దోచుకుని.. త‌ప్పు చేస్తాడు. ప్ర‌కృతిని విధ్వంసం చేసేవారు కొంద‌రైతే.. స‌హ‌జ జీవ‌నాన్ని నాశ‌నం చేసేవారు మ‌రికొంద‌రు. కొంద‌రు కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కుంటారు. ఫ‌లితం.. అనర్థాలు విస్ఫోట‌నం చెందుతాయి. క‌రోనా మ‌హమ్మారి లాగా.. వాటికి అవ‌కాశం ఇస్తుంది మ‌న‌మే. అన్నింటినీ ఆగం చేస్తుంది, నాశ‌నం చేస్తుంది మ‌న‌మే.

మ‌నుషుల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట లేదు. ఒక‌ప్ప‌టి స్పానిష్ ఫ్లూ కావ‌చ్చు, త‌రువాత వ‌చ్చిన కరువు కావ‌చ్చు.. మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన క‌రోనా.. తాజాగా జ‌రిగిన స్టిరీన్ వాయువు ఉదంతం కావ‌చ్చు.. అన్నింటికీ మ‌నిషే కార‌ణం.. ఫ‌లితం.. ప‌క్షాగం.. ప‌శువాగం.. మ‌నిషాగం.!! క‌రోనా క‌న్నీటి క‌థ‌లు కావ‌చ్చు.. విశాఖ‌.. శోక‌సంద్రాలు కావ‌చ్చు..!! అన్నింటికీ మ‌నిషే కార‌ణం..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version