కూతుళ్ళు దూరంగా ఉంటున్నారా…? అయితే, జాగ్రత్త…!

-

తరం మారింది, సమాజం తీరు మారింది, తల్లితండ్రుల ఆలోచనల్లో చాలా వరకు ఆడపిల్లల పట్ల వివక్షత కూడా తగ్గింది.కానీ ఏది ఏమైనప్పటికి సమాజం ఎంత మారినప్పటికీ ఇంకా ఆడపిల్లల మీద జరిగే లైంగిక దాడులు, అత్యాచారాల లో కానీ ఇంకా మార్పు రాలేదు. తల్లితండ్రులకు చదువుకోసం, ఉద్యోగం కోసం, ఇలా ఎదో ఒక కారణం తో బయటికి వెళ్ళిన కూతురు ప్రతి రోజూ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు మనసు కుదురు ఉండటం లేదు.

అలాంటిది దూర ప్రాంతాలకు చదువుల కోసం,ఉద్యోగం కోసం వెళ్లిన ఆడపిల్లల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేయలేనిది అని చెప్పాలి. ఫ్రెండ్స్ తో టూర్ అని,పుట్టినరోజు పార్టీ ఉంది అని ఫోన్ చేసి చెప్తే ఇక్కడ తల్లితండ్రుల పరిస్తితి వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు గుండెలు అరచేతిలో పట్టుకొని ఉంటున్నారు.వెళ్లొద్దు అంటే అమ్మాయి కి కోపం,ఆడపిల్ల అని ఆంక్షలు పెడుతున్నారు అని,

అలా అని వాళ్ళ ఇష్టానికి ఊరుకుంటే ఏ క్షణం ఏం అవుతుంది అని తల్లితండ్రులు ఆందోళన చెప్పరాని విధంగా ఉంటుంది. ఆహారం సరిగా ఉండటం లేదని,హాస్టల్ లో శుభ్రత లేదని ఈ మధ్య హాస్టల్ లో ఉండటానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిపి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.స్నేహాలు కూడా అమ్మాయిల ఆలోచనల్లో మార్పు తెస్తున్నాయి అని చెప్పాలి.

పల్లెల నుంచి పట్నం వచ్చిన అమ్మాయిలు త్వరగా ఇక్కడి పోష్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు.అది ఎంత వరకు దారి తీస్తుందో వారికే తెలియని పరిస్తితి. సొసైటీ లో పబ్ కల్చర్ విచ్చల విడిగా పెరిగిపోయింది.అమ్మాయిలు మందు, సిగరెట్ లకు అలవాటు పడుతున్నారు.కాబట్టి దూర ప్రాంతాల్లో చదువు, లేదా ఉద్యోగం చేసే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి పిల్లల తీరును పరిశీలించుకుంటూ ఉండాలి.

ఒకటికి పదిసార్లు తప్పొప్పుల గురించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి క్షణం వారు ఎక్కడికి వెళ్తున్నారు,ఎవరితో వెళ్తున్నారు, వారి స్నేహితుల వివరాలు మాటల్లో అడిగి తెలుసుకోవాలి.ఒక వేళ ఏదైనా జరగరానిది జరిగితే మేము ఉన్నాం అన్న భరోసా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాలి.అప్పుడే మన ఇంటి ఆడపిల్లని మనం కాపడుకోగలం.

Read more RELATED
Recommended to you

Latest news