రాజకీయాల్లో ఒక పార్టీకి మద్ధతుగా ఉంటూ న్యూట్రల్ ముసుగులో ఉండే వ్యక్తుల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చు..వారు చెప్పే మాటలని ప్రజలు నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి…దాని వల్ల వారు టార్గెట్ చేసిన పార్టీకి గాని, నాయకుడుకు గాని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. న్యూట్రల్ గా ఉన్న కొందరు వ్యక్తులు జగన్ యాంటీ టీంగా తయారై…నెక్స్ట్ చంద్రబాబు-పవన్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
అయితే గతంలో చంద్రబాబు యాంటీ టీం కూడా జగన్ ని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలామంది వ్యక్తులు పనిచేశారు. ఆయన్ని ఎలాగైనా గద్దె దింపాలనే కసితో పనిచేశారు. అలా పనిచేసిన వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్, ముద్రగడ పద్మనాభం, మోత్కుపల్లి నర్సింహులు…ఆఖరికి టీటీడీలో ఉండే రమణ దీక్షితులు సైతం బాబుకు యాంటీగా పనిచేశారు. వీరే కాదు…ఇంకా పలువురు నేతలు బాబుని నెగిటివ్ చేస్తూ…జగన్ ని లేపే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు…దీని వల్ల చివరికి చంద్రబాబు అధికారం కోల్పోయారు..జగన్ అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు అదే ఫార్ములాతో జగన్ యాంటీ టీం పనిచేస్తుంది..కొందరు నేతలు న్యూట్రల్ గా ఉంటూ…చంద్రబాబు-పవన్ కు అనుకూలంగా నడుస్తున్నారు. అంటే వారిద్దరు పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇక వారి పని వచ్చి ఒక్కటే ఎప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం…జగన్ ప్రభుత్వం విధానాలపై విమర్శలు చేయడం. అలా జగన్ యాంటీ టీంగా పనిచేస్తున్న వారిలో రఘురామకృష్ణంరాజు, శివాజీ, మహాసేన రాజేశ్…ఈ టీంలోకి బండ్ల గణేశ్ కూడా వచ్చి చేరారు.
అందుకే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక టీం ఏర్పాటు అవుతుంది…ఆ టీం లక్ష్యం…జగన్ ని గద్దె దించడం…బాబు-పవన్ లని అధికారంలోకి తీసుకురావడం…మరి జగన్ యాంటీ టీం లక్ష్యం నెరవేరుతుందేమో చూడాలి.