ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి శాపంగా మారిన ఆయన కుమార్తె ?

-

ఏపీలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడీ ఆపరేషన్ స్పీడు మరింత పెరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్ర నేతలు ఏపీలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి పాలయ్యాక టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగా.. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ నేతలంతా బీజేపీలో చేరేందుకు.. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరే కారణమని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె టీడీపీకి శాపంగా మారిందని కూడా పలువురు అంటున్నారు.

ఏపీలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడీ ఆపరేషన్ స్పీడు మరింత పెరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్ర నేతలు ఏపీలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇటీవలే టీడీపీ నేత అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. దీంతోపాటు మరికొందరు టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఓ వైపు తమ పార్టీ నుంచి నేతలు అందరూ బీజేపీలోకి వెళ్తున్నా.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తున్న నేతలను బీజేపీ నాయకురాలు పురందేశ్వరే దగ్గరుండి తమ పార్టీలోకి టీడీపీ నేతలను చేర్పిస్తున్నారట. దీంతో తన తండ్రి ఎన్టీఆర్ పార్టీని ఆమె కూల్చివేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పురందేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీకి శాపంగా మారారని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీని తన కుమార్తెనే స్వయంగా కూల్చివేస్తుందంటూ ఆమెపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పురందేశ్వరి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో బాబు కక్కలేక, మింగలేక ఊరుకుంటున్నారట. మరి ముందు ముందు ఇంకా ఎందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version