తెలంగాణలో సర్వేల గోల ఎక్కువైపోయింది…ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో క్లారిటీ లేదు గాని..ఇప్పటినుంచే గెలుపోటములపై సర్వేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న మూడు ప్రధాన పార్టీలు సెపరేట్ గా సర్వేలు చేయించుకుంటున్నాయి…అలాగే ఇతర సంస్థలు సైతం సర్వేలు చేస్తున్నాయి. అయితే ఇంతవరకు అధికారికంగా ఏ సర్వే కూడా బయటకు రాలేదు. ఎప్పటికప్పుడు పీకే టీంకు సంబంధించిన సర్వేలు బయటకొస్తున్న విషయం తెలిసిందే.
పీకే టీం…టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఆ టీం ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సర్వేలు చేస్తూ..కేసీఆర్ కు రిపోర్టులు అందిస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం సెపరేట్ గా సర్వే చేయించుకుంటున్నట్లు తెలిసింది. అలాగే బీజేపీ సైతం అదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇతర సంస్థలు కూడా తెలంగాణలో రాజకీయ పరిస్తితులపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నాయి. కాకపోతే అధికారికంగా ఏ సర్వే బయటపడలేదు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం పీకే టీం సర్వే గాని, మస్తాన్ సర్వేలో గాని, ఇంకా ఇతర సర్వేల్లో కాంగ్రెస్ పార్టీనే లీడింగ్ లో ఉందని చెబుతున్నారని వివరించారు.
కానీ అధికారికంగా ఏ సర్వే బయటపడలేదు. ఇక రేవంత్ రెడ్డి…మస్తాన్ పేరు తీయడంతో…తాజాగా రేవంత్‌రెడ్డి కూడా తమ సంస్థ పేరును ప్రస్తావించడంతో తాను మీడియా ముందుకు వచ్చానని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత మస్తాన్ తెలిపారు. ఏకంగా ఆయన మీడియా ముందుకొచ్చి…తమ సంస్థ మూడు దఫాలుగా చేసిన సర్వేన మీడియా ముందు బయటపెట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం, బీజేపీకి 30.48%, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు వస్తాయని..ఇతరులకు 6.91 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.
అయితే ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం చెప్పలేదు…కానీ టీఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తుందని వెల్లడించారు…ఎన్నికల నాటికి ఇంకా తగ్గొచ్చని చెప్పారు. అలాగే బీజేపీ ఓటింగ్ పెరుగుతుందని అన్నారు..ఇటు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు నమ్మడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్తితి అంత మెరుగ్గా లేదని చెప్పారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి 87 సీట్లలో, కాంగ్రెస్ పార్టీకి 53 సీట్లలో, బీజేపీకి 29 సీట్లలో బలమైన అభ్యర్ధులు ఉన్నారని చెప్పారు.
ఇక సడన్ గా ఆరా సంస్థ సర్వే బయటపెట్టడంతో అన్నీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది…ఎందుకంటే ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేదు…పైగా ఓట్ల శాతంలో ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం తగ్గుతూ రావడం అనేది టీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్..ఇంకా అలాగే తగ్గుతూ వెళితే తమకు అధికారం దక్కడం కష్టమే అని టీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. అటు బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుంది గాని…ఇంకా అధికారం దక్కాలంటే ఇప్పుడు ఉన్నది సరిపోదు..ఇంకా బలం పెంచుకోవాలి..అలాగే బీజేపీకి ఇంకా బలమైన అభ్యర్ధులు కావాలి.
అటు కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులు ఉన్నా సరే…ఓట్ల శాతం మాత్రం పెరగలేదు…దీని వల్ల ఆ పార్టీకి మరొకసారి అధికారం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఆరా సర్వే…అన్నీ పార్టీల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పొచ్చు.