భారత్‌కు మరణశాసనం లిఖిస్తున్న తబ్లిగీలు

-

రక్షితంగా బయటపడిన దేశంగా భారత్‌ నేడు సగర్వంగా నిలబడిఉండేది. కేవలం ఒకే ఒక్క సమావేశం భారతదేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఇంకా ఎంత చేయనుందో..?

నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు… దక్షిణ ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌లో ఉండే ఒక మసీదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘తబ్లిగీ జమాత్‌’ వ్యవస్థకు ప్రధాన కార్యాలయం. తబ్లిగీ జమాత్‌ అంటే ‘ప్రవచన బృందం’ అని అర్థం. మహమ్మద్‌ ప్రవక్త తన జీవితకాలంలో ఆచరించిన ముస్లిం పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ప్రచారం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 200 దేశాలనుంచి దాదాపు 8 కోట్ల మంది సభ్యులుంటారని ఓ అంచనా.

ఇదే…… ఆ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు

Nizamuddin Markaz delhi

2020లో భారత్‌లో తలపెట్టిన మీటింగ్‌, నిజానికి మహరాష్ట్రలో జరగాల్సింది. ముంబయి సరిహద్దుల్లో గల వాసైలో ఈ సమ్మేళనం జరపాలని తబ్లిగీ జమాత్‌ నిర్ణయించినా, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి పోలీస్‌ శాఖలు అడ్డుకున్నాయి. దాంతో ఆ మీటింగ్‌ను నిజాముద్దీన్‌కు తరలించారు. అక్కడే ఉన్న మసీదు భవనంలో మార్చి 21 వరకు ప్రతీవారం మీటింగ్‌ ( ఇజ్తెమా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మార్చి 13న ఢిల్లీ ప్రభుత్వం, కరోనా మూలంగా ఎటువంటి మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఆయితే తబ్లిగీ వాటిని బేఖాతరు చేసి సమావేశాలను నిర్వహించింది. దాదాపు 9వేల మందికి పైగా సభ్యులు హాజరైనట్లు తెలిసింది. ఇందులో 2 వేల మంది విదేశీయులేనని, ఈ విషయంలో కేంద్ర నిఘా వ్యవస్థ, ఢిల్లీ పోలీసుల సమిష్టి వైఫల్యం ఉందని తేలింది.

అసలు తీగ లాగింది తెలంగాణ పోలీసులు. డొంక కదిలింది ఢిల్లీలో. కరీంనగర్‌లో తేలిన 11మంది ఇండొనేషియన్లకు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, ఢిల్లీకి తన పోలీసులను పంపింది. అక్కడ ఈ మర్కజ్‌ సంగతి, దాని కథాకమామిషు బయటపడటంతో, కేంద్రాన్ని హెచ్చరించింది. ఇక అక్కన్నుంచి ఏయే రాష్ట్రాల నుంచి ఎంతమంది హాజరయ్యారు? వారిలో ఎంతమందికి కరోనా సోకింది? అనే విషయాల పట్ల రాష్ట్రాలు బిజీ అయిపోయి లెక్కలు తీసి, వారందరినీ వెంటాడే పనులు మొదలెట్టాయి. తెలంగాణ నుండి 1030, ఆంధ్రా నుండి 1200, తమిళనాడు నుండి 2000..ఇలా ఉండటంతో వారందరినీ దొరకబుచ్చుకోవడం శక్తికి మించిన పనయ్యంది. అయినా, 3193 మంది తబ్లిగీ సభ్యులను పట్టుకుని క్వారంటైన్లకు తరలించారు. వారిలో 765 మందికి కరోనా సోకింది. ఇంకా పట్టుబడకుండా, దాక్కున్నది దాదాపు 6 వేల మంది.

ఈ తబ్లిగీ జమాత్‌ వ్యవస్థకు సర్వాధికారి మర్కజ్‌ మసీదు మౌలానా… మహమ్మద్‌ సాద్‌ కండ్లావీ. ఈ 54 ఏళ్ల ప్రవక్త, ఏది చెబితే అదే ఈ సభ్యులు ఆచరిస్తారు. ఢిల్లీలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఈ సాద్‌, అడ్డదారుల్లోనే ఈ అందలం ఎక్కాడని ఆరోపణలున్నాయి. పలు ఇతర ముస్లిం సంస్థలు ఇతడిపై చాలా సార్లు ఫత్వాలు జారీ చేసాయి. మొన్నటి జమాత్‌కు సంబంధించి కూడా ఈయన ప్రత్యక్ష ప్రమేయమే ఎక్కువ. ’’పోలీసులు మనకు అనుమతి ఇవ్వలేదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరం హాజరవుదాం’’ అని సభ్యులందరికీ పంపిన వాట్సప్‌ ఆడియో మెసేజ్‌ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది. మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ సంగతేంటో మొత్తం తేల్చండి అంటూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాలతో ఢిల్లీ క్రయిమ్‌ బ్రాంచ్‌ కేసును చేపట్టింది. మసీదును పూర్తిగా ఖాళీ చేయించి, సీల్‌ వేసింది. ఇంతా చేసిన మౌలానా సాద్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులకు ఇంకా దొరకలేదు.

Tablighi Jamaat Markaz chief maulana mohammad saad

ఆరు వేల మంది తబ్లిగీలు ఎక్కడున్నారన్నది ఇప్పుడు దేశానికి అతిపెద్ద సవాల్‌. రాష్ట్రాల వద్ద ఉన్న సమాచారం ప్రకారం చూస్తే, అందరి సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ అయిఉన్నాయి. ఎందుకిలా? వారందరూ ఎందుకు దాక్కోవాల్సివచ్చింది? ప్రభుత్వాలు, మతపెద్దలు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వీరెవరూ స్పందించకపోవడంలో అర్థమేమిటి? వీరెవరూ దొరక్కుండా, కరోనాను ఈ దేశం నుండి పారద్రోలడం దాదాపు అసాధ్యం.

నిజానికి ఈ మర్కజ్‌ మీటింగ్‌ అనేది లేకపోయిఉంటే, భారత్‌ ఈపాటికి కరోనా విముక్త దేశంగా ప్రకటితమయ్యేది. ప్రజలు మళ్లీ ఎప్పట్లాగే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. దేశ ఆర్థికపరిస్థితి ఇంత దారుణంగా ఉండేదేకాదు. ఏప్రిల్‌ 7వ తేదినాటికి కొద్దిపాటి కేసులే ఉండేవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా. 5వేల కేసులు కూడా చూడం అనుకున్నది కాస్తా పదివేలు దాటిపోయాయి. కేవలం తబ్లిగీల వల్లే. ఇదిలా ఉండగా, క్వారంటైన్‌లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్న తబ్లిగీలు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో బట్టలిప్పి తిరగడం, నర్సులతో బూతులు మాట్లాడటం, మూత్రం నింపిన సీసాలు బయటికి విసిరేయడం, వరంగాల్లోనే మల విసర్జన చేయడం, కిటికీల్లోనుండి ఉమ్మేయడం లాంటి నీచమైన పనులకు తెగబడుతున్నారు.

మానవత్వానికే శత్రువులుగా పరిణమించిన వీరు నిర్భయ, దిశ హంతకుల కంటే ఏమాత్రం తీసిపోరని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. వీరిపట్ల ఏమాత్రం సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, కఠినాతికఠినమైన శిక్షలు విధించాల్సిందేనని ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆవేశం. ప్రజలలో వీరిపట్ల తీవ్ర ఏహ్యభావం ఏర్పడింది. వీరి వల్ల మొత్తం ముస్లిం సమాజమే చిన్నచూపుకు గురయ్యే అవకాశముంది. ఇవాళ ఎంతోమంది ముస్లిం పెద్దలు పేదలకు అన్నదానం చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు.

అజ్ఞాతంలో ఉన్న ఆరువేల మంది తబ్లిగీల ఆచూకీ తెలుసుకోవాల్సిఉంది. అందుకోసం అన్నిరకాల ఉపాయాలను వాడాలి. దీని వెనుక ఏదైన పెద్ద కుట్ర దాగిఉందా? అనేది కూడా కావాలి. అవసరమైతే సైన్యాన్ని, కేంద్ర నిఘా వ్యవస్థను, ఇందుకు నియోగించాలి. తప్పదు. దేశం కోసం ఏదైనా చేయాల్సిందే. ఇటువంటప్పుడు కూడా రాజకీయాలు ఆలోచించేవాళ్లెవరైనా ఉంటే వారిని కూడా దొరికినవారితో కట్టేయాల్సిందే.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version