నవరత్నాలు ఖచ్చితంగా అమలు చేస్తామంటూ చెపుతున్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పుతుందా…? అసలు నవ రత్నాలు అమలు కన్నా కేవలం రాజకీయ ప్రత్యర్థుల భరతం పట్టేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందా..? అసలు నవరత్నాలు అమలు చేస్తే ఏపీ ప్రభుత్వ ఖజానా సరిపోతుందా…? అనే ప్రశ్నలు ఇప్పటికే అనేక సార్లు వినిపిస్తున్నతరుణంలో ఇప్పుడు కొత్తగా మరో మాట తప్పిందా… వైసీపీ సర్కార్ అనే టాక్ వినిపిస్తుంది.
ఇంతకు వైసీపీ సర్కారు మాట తప్పిన ఆ పథకం ఏంటీ అనేది ఓ చర్చ. ఎన్నికల హామీలో భాగంగా వైసీపీ పార్టీ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి… ప్రభుత్వం అంటే ఏంటో చూపుతాం… పరిపాలన అంటే ఏందో చూపిస్తాం… అని ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది. అదే క్రమంలో అనేక హామీలను నవరత్నాల పేరుతో ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో వైసీపీ కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించడం… వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఆ నవరత్నాల్లో కొన్ని ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను అధికారులకు అప్పగించింది.
ఇకపోతే నవరత్నాలను అధికారులు తూచ తప్పకుండా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఖరాకండిగా చెప్పెసారు. అధికారులు మాత్రం సరే అన్నారు.. కానీ అధికారుల మనస్సులో ఈ నవరత్నాలు అమలు చేయాలంటే ఖజానా సరిపోద్దా అనే అనుమానంతో ఉన్నారు.. ఇప్పుడు సీఎం జగన్ చెప్పిన మాటలకు అధికారులు చెబుతున్న మాటలకు ఎక్కడ పొంత ఉండని పరిస్థితి నెలకొంది.
సర్కారు చెప్పినట్లుగా ఏపీ ప్రజలకు సన్న బియ్యం అందించే పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు.. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం చావు కబురు చల్లగా చెప్పినట్లుగా సన్న బియ్యం ఇస్తామని ఏనాడు చెప్పలేదని సెలవిస్తున్నారు. సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్న జనాలకు అధికారులు ఇస్తున్న సమాధానంతో మైండ్ తిరిగి పోయింది… ఇంతకు సన్న బియ్యం పథకం అమలు కాదా..? అనే అనుమానాలు వస్తున్న తరుణంలో ఆ శాఖ అధికారి ఇచ్చిన వివరణతో ఇక సన్న బియ్యం పథకం అటకెక్కినట్లే అనే సందేహాలు వస్తున్నాయి.
ఏపీ పౌరసరఫరాల కార్యదర్శి కోన శశీధర్ కొన్ని వాస్తవాలు చెప్పారు. రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యంలో క్వాలీటీ తక్కువగా ఉందట. ఈ బియ్యం నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలను జారీ చేసిందట… కేంద్ర విధి విధానాల మేరకు మేము సన్న బియ్యం ఇస్తామని ఏనాడు చెప్పలేదు.. కాకుంటే నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామన్నామని సెలవిస్తున్నారు…సన్న బియ్యం అంటే స్వర్ణ రకం, దానికి దగ్గరగా ఉండే బియ్యం సరఫరా చేస్తాము అంటూ కార్యదర్శి చెప్పడం చూస్తుంటే సన్న బియ్యం పథకం ప్రారంభం కాకుండానే పోయేలా ఉంది…
ఇంకా శశీధర్ ఏమన్నాడంటే.. 15 శాతం నూకలు ఉండేలా, 80శాతం స్వర్ణ, మరో 20శాతం ఇతర బియ్యంను మిక్స్ చేసి జనాలకు పంచుతాడట… ఇప్పటికే 60వేల గోడౌన్లలో 11లక్షల40వేల టన్నుల బియ్యంను నిల్వ చేశామని శ్రీకాకుళం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పంపిణి ప్రారంభిస్తామని కార్యదర్శి శశీధర్ చెప్పడం సన్న బియ్యం పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి… అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా జనాలకు సన్న బియ్యం అందించడం వీలు కాదనే విధంగా కార్యదర్శి వాఖ్యాలు ఉండటం పట్ల సన్న బియ్యం పథకం అమలు అయ్యెనా… ఏపీ సర్కారు ఈ పథకంపై జారుకున్నట్లేనా అని జనాలు అడుగుతున్నారు…