నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్‌సీఎల్‌లో 1500 జాబ్స్‌..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్‌ (సింగ్రౌలి) లోని నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ (ఎన్‌సీఎల్‌) పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది.

ఎన్‌సీఎల్‌లో జాబ్స్‌ | Jobs in NCL

 

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్‌ (సింగ్రౌలి)లోని నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ (ఎన్‌సీఎల్‌) వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న 1500 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తోంది. ఈ పోస్టులకు ఎనిమిది, పదోతరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

ఇక ఉద్యోగం పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు- 1500,వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌)- 100,
ఫిట్టర్‌- 800, ఎలక్ట్రీషియన్‌- 500, మోటార్‌ మెకానిక్‌- 100. వయసు 2021 జూన్‌ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ జులై 09, 2021.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 9 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://nclcil.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఎనిమిది, పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version