ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతూనే ఉంది. రోజు రోజు ఇరు రాష్ట్రాల నేతలు… ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే… ఈ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసిఆర్ మంచి ఆలోచన అభిమానంతో… ఆంధ్రాకి సహకరిస్తామన్నారని గుర్తు చేశారు.
రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారని… తెలుగు రాష్ర్టాలలో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి వున్నారని పేర్కొన్నారు. ఏపి- తెలంగాణ అంటే… ఇండియా పాకిస్తాన్ కాదని.. ఇద్దరు సీఎంలు కూర్చోని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. జగన్ కి కేసిఆర్ అంటే అభిమా నమని.. కేసిఆర్ కి జగన్ మీద అభిమానం వుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని.. జగన్, కేసిఆర్ మధ్య విభేదాలు తీసుకురావడానికి కోంత మంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.