UPSC CMS: గుడ్ న్యూస్.. 838 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CMS) 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం దీనిలో 838 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

UPSC
UPSC

ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఎగ్జామ్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు సైతం అప్లై చేస్కోవచ్చు. జులై 27 దరఖాస్తులకు చివరి తేది. ఈ పోస్టులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు సైతం అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2021 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు. సీఎంఎస్‌ పరీక్ష తేది నవంబర్‌ 21, 2021.

హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం లో పరీక్ష రాయచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి ఇతరులకు రూ.200, మహిళ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news