గవర్నమెంట్ స్కూల్ లో చదివినా… దుమ్మురేపాడు…!

-

ప్రభుత్వ స్కూల్ లో చదివితే చదువు సరిగా రాదు అనే భయం అమ్మా నాన్నలను వెంటాడుతూ ఉంటుంది. అందుకే అప్పో సొప్పో చేసి మంచి స్కూల్ అంటూ ప్రైవేట్ స్కూల్స్ లో వేస్తారు. కాని ఒక విద్యార్ధి ప్రభుత్వ స్కూల్ లో చదివి సత్తా చాటాడు. తమిళనాడులో ఒక పశువుల కాపరి కొడుకు ఈ సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను క్లియర్ చేసి, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి… దేశంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విద్యార్ధి ఈ కోర్స్ ను పూర్తి చేయలేకపోవచ్చు అని చెప్పాడు. అతని తండ్రి ఉపాధి హామీ పనులకు కూడా వెళ్తూ ఉంటాడు. పెరియాకుళంలోని సిల్వర్‌పట్టిలోని ప్రభుత్వ మోడల్ హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థి అయిన అతను… మొత్తం 720 మార్కులకు గానూ 664 మార్కులు సాధించాడు. తన కుటుంబానికి వైద్య విద్య భారం అని పేర్కొన్నాడు. ఇప్పుడు నేను ఎంబిబిఎస్ కోర్సు చేయాలనుకుంటున్నాను అన్నాడు. కాని అది సాధ్యం కాదని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version