తిరుమల శ్రీవారి ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కన్ను పడటం దారుణం అని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. డిపాజిట్లు డ్రా చేయటం కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతియటమే అని ఆయన మండిపడ్డారు. మొన్న టీటీడీ భూములను అమ్మలని చూశారు నేడు వేల కోట్లు డిపాజిట్లు పై కన్నువేసారని విమర్శించారు. టీటీడీ నిధులు వేల కోట్లు అధిక వడ్డీ పేరుతో ఏపీ ఖజానాకు వస్తే ఇక అంతే అన్నారు.
అధిక వడ్డీ ఇస్తామంటే ప్రైవేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేయటానికి టీటీడీ కి రూల్స్ లేవు అని అన్నారు. ఏపీ ఖజనాకు టీటీడీ నిధులు వస్తే గోడకు కొట్టిన సున్నం లాగే ఉంటాయని అన్నారు. ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లు 17 నెలలో అప్పు తెచ్చారు అని ఆయన విమర్శించారు. టీటీడీ ఉద్యోగులు మేల్కొనాలి అని సూచించారు. భవిష్యతతులో ఎవ్వరూ కానుకలు ఇవ్వటానికి ముందుకురారని పేర్కొన్నారు.