ఇంటర్ పాస్ అయ్యారా..? అయితే రూ.70 వేల స్కాలర్‌షిప్ ని పొందండిలా..!

-

12వ తరగతి ఉత్తీర్ణులైన అయిన విద్యార్ధులకి గుడ్ న్యూస్. జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-2021 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కేంద్ర విద్యా శాఖ. కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉండి, ప్రతిభ కలిగిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇస్తారు.

 

 

అలానే నాలుగు, ఐదు సంవత్సరాలకు ఏడాదికి రూ.20,000 చొప్పున అందిస్తారు. మొత్తం మీద గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తయ్యే లోపు రూ.70 వేల వరకు పొందొచ్చు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు దీనికి అర్హులు. అయితే ఈ ప్రయోజనం పొందాలి అంటే ఇతర స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలు పొందకూడదు.

డిప్లొమా కోర్సులు చదువుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. కరస్పాండెన్స్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయకూడదు. ఇది ఇలా ఉంటే విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యాక్ట్- 1956, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా డెంటల్ కౌన్సిల్ ఇండియా గుర్తించిన కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో రెగ్యులర్ కోర్సులు చదివే వాళ్ళు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. గ్రాడ్యుయేట్ నుంచి పీజీ కోర్సు వరకు ఈ పునరుద్ధరణ అందుబాటులో ఉంటుంది. ఆసక్తి, ఆర్హత కలిగిన విద్యార్థులు scholarship.gov.in పోర్టల్‌లో నవంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version