సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది. నిందితుడి చేతి పై ఉన్న టాటూ ఆధారంగా పోలీసులు బాడీని గుర్తించారు.
పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్న సమయంలో రాజు మృతదేహం లభ్యమైంది. ఇదిలా ఉండగా నిందితుడు ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేశాడు. గత మూడు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు.