గుడ్ న్యూస్: డిగ్రీ, ఇంటర్, టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

డిగ్రీ, ఇంటర్, టెన్త్ అర్హత ఉన్న వాళ్ళకి కేంద్రం తీపికబురు చెప్పింది. దానికి సంబంధించి వివరాలని చూస్తే… భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఓఎన్‌ఎల్) సంస్థ దేశ వ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.

ఫిబ్రవరి 15 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. మీరు మరిన్ని వివరాలని తెలుసుకోవాలంటే https://www.bharatiyapashupalan.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఇక పోస్టుల వివరాలకి వస్తే… సేల్స్‌ మేనేజర్‌- 64, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌- 485, సేల్స్‌ హెల్పర్‌- 2667 ఇలా 3216 ఖాళీలు ఉన్నాయి. సేల్స్‌మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదే సేల్స్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఇంటర్‌, సేల్స్‌ హెల్పర్‌ పోస్టులకు పదో తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి.

సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.  ఇక వయసు విషయానికి వస్తే.. సేల్స్‌ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్‌. ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇలా ఎంపిక చేస్తారు.

 

 

 

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...