డిజిటల్ హెల్త్ రంగంలో మంచి కెరీర్.. బెస్ట్ కోర్సుల పూర్తీ వివరాలు..

-

విద్యార్థి దశలో ఉన్నప్పుడే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి..అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది.. ఇప్పుడు అందరు డిజిటల్ హెల్త్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.ఆ రంగానికి సంభందించిన కోర్సులు పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగళూరు డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్‌లో ఆరు నెలల అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను తాజాగా ప్రారంభించింది.

హెల్త్‌కేర్, టెక్నాలజీ బిల్డింగ్ ఈ-హెల్త్, టెలిమెడిసిన్, పర్సనలైజ్డ్ హెల్త్‌కేర్, బయోటెక్, మెడికల్ డివైజ్‌ లు, వేరబుల్స్, డిజిటల్ థెరప్యూటిక్స్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్​ను అందిస్తోంది. సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్​ కు దరఖాస్తు చేసుకోవచ్చు..

అంతే కాకుండా..ఐఐఎస్​సీ ఈ కోర్సును అందిస్తోంది. ఆన్‌లైన్ కోర్సులో భాగంగా ఎడ్టెక్ కంపెనీకి చెందిన బ్రిడ్జ్ మాడ్యూల్ ద్వారా శిక్షణనిస్తోంది. మ్యాథ్స్ (Math)​, ప్రోగ్రామింగ్‌లో అభ్యర్థి లోతైన అవగాహన పెంచుకోవడంలో సహాయపడుతుంది.ఈ కోర్సుల కోసం ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకొవాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కింద తెలిపిన వెబ్ సైట్ లో పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చు.. https://talentsprint.com/programs.dpl అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.శని, ఆదివారాల్లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అభ్యర్థులు రూ. 1,70,000, ఎన్నారై (NRI)లు $2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది..అభ్యర్థులను వారి విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఐఐఎస్సీ ఎంపిక చేస్తుంది..ప్రత్యేక కోర్సులను కూడా ఇక్కడ నేర్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పూర్తీ వివరాలను నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news