మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన చెన్నై లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. చెన్నై లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 80 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 31, 2022 చివరి తేదీ. ఇక వయస్సు విషయానికి వస్తే.. డిసెంబర్ 12, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ళు ఉండాలి. ఇక అర్హత విషయానికి వస్తే.. పదో తరగతి తో పాటు సంబంధిత ట్రేడుల్లో ప్యాస్ అయి ఉండాలి.
అలానే 2019, 2022, 2021, 2022 ఐటీఐ బ్యాచ్లకు చెందిన వారై ఉండాలి. జనవరి 10, 2023వ తేదీలోపు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని కింద వున్న అడ్రెస్ కి పంపాల్సి వుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు కొనసాగే ఈ ట్రైనింగ్ పిరియడ్లో స్టైపెండ్ ని ఇస్తారు. ఇక ఖాళీల వివరాల లోకి వస్తే… డ్రాఫ్ట్మ్యాన్ (సివిల్), డ్రాఫ్ట్మ్యాన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా వున్నాయి. అలానేసెక్రటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ (హిందీ), హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ టేడ్రుల్లో కూడా ఖాళీలు వున్నాయి.