నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. HDFC బ్యాంకులో ఖాళీలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. HDFC బ్యాంకులో ఖాళీలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. Relationship Executive (Sales) విభాగం లో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఫ్రెషర్స్, అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యచ్చు. ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. వయో పరిమితి 22 నుంచి 30 ఏళ్లు ఉండాలి. టెలిఫోనిక్ రౌండ్ & పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ నెల 21 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెలిఫోనిక్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడురాళ్ల లో పని చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version