ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ ఎగ్జామ్ 2019కు గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్‌వో అసిస్టెన్స్ అడ్మిట్ కార్డు 2019ను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తోంది.
ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ ఎగ్జామ్ 2019కు గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఇవాళ్టి నుంచి ఈపీఎఫ్‌వో అసిస్టెన్స్ అడ్మిట్ కార్డు 2019ను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తోంది. ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ ఎగ్జామ్‌కు అప్లై చేసిన అభ్యర్థులు ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ అడ్మిట్ కార్డు 2019ను ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ – epfindia.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు, రిజిస్ట్రేషన్, రూల్ నంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను దగ్గరుంచుకోవాలి. ఈపీఎఫ్‌వోలో అసిస్టెంట్ పోస్టులకు గాను ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జూలై 30, 31వ తేదీల్లో ఉంటాయి. ఈ ఎగ్జామ్ రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1, ఫేజ్-2లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఫేజ్-1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసైన వారు ఫేజ్-2లో జరిగే మెయిన్ ఎగ్జామ్ రాయవచ్చు.
ఈపీఎఫ్‌వో ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను జూలై 20వ తేదీ అంటే.. నేటి నుంచి జూలై 30వ తేదీ వరకు వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే గడువు తేదీలోగా ఆ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈపీఎఫ్‌వో సూచించింది.
ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ ఎగ్జామ్ 2019 అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి….
స్టెప్ 1: ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in ను ముందుగా సందర్శించాలి.
స్టెప్ 2: హోం పేజీలో ఉండే ఈపీఎఫ్‌వో అసిస్టెంట్ అడ్మిట్ కార్డు 2019 లింక్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్ 3: తరువాత వచ్చే విండోలో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ లేదా రూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను ఇవ్వాలి.
స్టెప్ 4: అనంతరం వచ్చే విండోలో అభ్యర్థులకు అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
స్టెప్ 5: అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు రూపంలో ఉండే ఆ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న కార్డును ఎగ్జామ్ సందర్భంగా చూపించాలి.