జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. జూట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా జూట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

jobs

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ అకౌంటెంట్‌, జూనియర్ అసిస్టెంట్‌, జూనియర్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, ఎంకాం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోచ్చు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఆన్ లైన్ విధానం లో అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే.. అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 28,600 నుంచి రూ. 1,15,500 వరకు నెలకు వేతనం ఇస్తారు.

డిసెంబర్ 24వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. 2022 సంవత్సరం జనవరి 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక విధానం ఉంటుంది. https://www.jutecorp.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version