221 పోస్ట‌ల్ ఉద్యోగాలు…. పదవ తరగతి పాసైన వాళ్ళు అప్లై చెయ్యచ్చు..!

-

మీరు పదవ తరగతి ప్యాస్ అయ్యారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీసుల్లో పది అర్హత తో పలు జాబ్స్ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు.  ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌ లో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. దీనిలో మొత్తం 221 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నట్టు ఈ నోటిఫికేష‌న్ ద్వారా వెల్ల‌డించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ  అక్టోబ‌ర్ 4, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అప్లై చేయడానికి న‌వంబ‌ర్ 12, 2021 వ‌రకు అవ‌కాశం ఉంది. కనుక ఆ లోగా అప్లై చేసుకోండి.

Postoffice

పోస్ట్ ఆఫీసుల్లో కార్యాలయాల్లో పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ , సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్  లాంటి పోస్టులు ఉన్నాయి. వయస్సు వచ్చేసి  18 నుంచి 27 ఏళ్లు వరకు ఉండచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మొత్తం 221 ఖాళీల‌ను భర్తీ చేస్తుండగా.. పోస్టల్ అసిస్టెంట్ 72, పోస్ట్‌మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ 90,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 59 వున్నాయి. ఇక విద్యార్హతలు చూస్తే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవ తరగతి  పాసై ఉండాలి.

ఇక శాలరీ విషయానికి వస్తే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ కోసం www.indiapost.gov.in ను సంద‌ర్శంచాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version