IAF లో 255 ఖాళీలు.. ఈరోజే అప్లై చెయ్యండి…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దీనిలో మొత్తం 255 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ లాంటి పోస్టులు వున్నాయి.

ఇప్పటికే పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయాలనుకునే వాళ్ళు 2021 మార్చి 13 లోగ అప్లై చేసుకోండి. 2021 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 మధ్య పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలని https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఎలా అప్లై చెయ్యాలి అనే విషయానికి వస్తే… నోటిఫికేషన్‌లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి పోస్టులో పంపాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, క్లర్క్ హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్, లాండ్రీమ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

ఎంపిక అయిన వాళ్ళకి లెవెల్ 1 పోస్టుకు రూ.18,000, లెవెల్ 2 పోస్టుకు రూ.19,900, లెవెల్ 4 పోస్టుకు రూ.25,500 వేతనం లభిస్తుంది. ఇక వయస్సు అయితే 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news