ఏఐఈఎస్‌ఎల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌… వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 22 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.

 

అయితే వీటిలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలలోకి వెళితే… మొత్తం పోస్టులు- 22, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌- 8, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ అకౌంట్స్‌- 14.
ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏలలో ఏదో ఒకటి, అకౌంట్స్‌ పోస్టులకు కామర్స్‌ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు 2021, ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆగస్టు 28 దరఖాస్తులకు చివరి తేది. ఇక దరఖాస్తు విధానం చూస్తే.. ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://aiesl.airindia.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.