Job Notification : టెన్త్ అర్హ‌త‌తో 269 గ్రూప్‌-సీ కానిస్టేబుల్‌ పోస్టులు…

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Job Notification విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్‌-సీ కానిస్టేబుల్‌ పోస్టులు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

Army Job Notification
Army Job Notification

ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో మొత్తం 269 గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత చూస్తే..గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. అదే విధంగా ఛాంపియన్‌షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించిన వారు దరఖాస్తు చేయొచ్చు అని తెలిపారు.

పోస్టుల వివరాలు:

బాక్సింగ్ (మెన్)- 10
బాక్సింగ్ (వుమెన్)- 10
జూడో (మెన్)- 8
జూడో (వుమెన్)- 8
స్విమ్మింగ్ (మెన్)- 12
స్విమ్మింగ్ (వుమెన్)- 4
క్రాస్ కంట్రీ (మెన్)- 2
క్రాస్ కంట్రీ (వుమెన్)- 2
కబడ్డీ (మెన్)- 10
వాటర్ స్పోర్ట్స్ (మెన్)- 10
వాటర్ స్పోర్ట్స్ (వుమెన్)- 6
వుషూ (మెన్)- 11
జిమ్నాస్టిక్స్ (మెన్)- 8
హాకీ (మెన్)- 8
వెయిట్ లిఫ్టింగ్ (మెన్)- 8
వెయిట్ లిఫ్టింగ్ (వుమెన్)- 9
వాలీబాల్ (మెన్)- 10
రెజ్లింగ్ (మెన్)- 12
రెజ్లింగ్ (వుమెన్)- 10
హ్యాండ్ బాల్ (మెన్)- 8
బాడీ బిల్డింగ్ (మెన్)- 6
ఆర్చరీ (మెన్)- 8
ఆర్చరీ (వుమెన్)- 12
తైక్వాండో (మెన్)- 10
అథ్లెటిక్స్ (మెన్)- 20
అథ్లెటిక్స్ (వుమెన్)- 25
ఈక్వెస్ట్రియన్ (మెన్)- 2
షూటింగ్ (మెన్)- 3
షూటింగ్ (వుమెన్)- 3
బాస్కెట్ బాల్ (మెన్)- 6
ఫుట్‌బాల్ (మెన్)- 8

ఇది ఇలా ఉంటే పురుషులు ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు ఉండాలి అని అన్నారు. వయస్సు అయితే 2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22, 2021. పూర్తి వివరాలని https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్‌లో చూసి అప్లై చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news