నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఆ కోర్సుల‌ను ఫ్రీగా నేర్పించ‌నున్న అమేజాన్‌..

-

ప్ర‌స‌త్తుం మ‌న దేశంలో నిరుద్యోగం ఎంత‌లా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఈ నిరుద్యోగం కాస్తా మ‌రింత ఎక్కువైంది. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇప్ప‌డు అమెజాన్ మరోసారి వెబ్ సర్వీసెస్ రీ స్టార్ట్ ప్రోగ్రాంతో నిరుద్యోగుల‌కు మ‌రో చాన్స్ ఇస్తోంది. అదేంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో ఫుల్ టైం, క్లాస్ రూం బేస్డ్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్ మెంట్ కోర్స్ ల‌ను అందించేందుకు అమేజాన్ ముందుకు వ‌స్తోంది. కాగా ఈ ట్రైనింగ్ చేసేందుకు స్టూడెంట్లు టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లో గ‌తంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే స‌రిపోతుందంట‌.

aicte decides to start this academic year from September 15

అయితే ఈ అమేజాన్ అందిస్తున్న కోర్సుల ద్వారా టెక్నాలజీ సంబంధించిన విష‌యాల‌తో పాటు రెజ్యుమె రైటింగ్, ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చేయాలో ఇందులో చాలా స్ప‌ష్టంగా ఉంటుంద‌ని తెలిపింది. ఇక ఈ కోర్సుల్లో డేటాబేస్ స్కిల్స్, లైనెక్స్, పైథాన్, సెక్యూరిటీ, నెట్ వర్కింగ్ వంటివన్నీ కూడా ఫ్రీగానే నేర్పిస్తోంది. ఏదైనా కంపెనీల్లో జాబ్ చేసేందుకు కావాల్సిన బేస్ స్కిల్స్‌ను ఇంద‌లో నేర్పిస్తార‌ని అమేజాన్ సిబ్బంది చెబుతున్నారు.

అయితే ఈ ప్రోగ్రామ్ ను పన్నెండు వారాల పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రోగ్రాం ఉంటుంద‌ని అయితే ఇందులో స్టూంఎడ్ల‌కు క్లౌడ్ కంప్యూటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అంశాల‌ను నేర్చుకోవ‌చ్చు. కాగా ఈ ప్రొఫెషనల్ కోర్సులో దాదాపుగా 52 సిటీల్లో 25 దేశాల్లో అందించేందుకు అమేజాన్ కృషి చేస్తోంది. ఈ టెక్నిక‌ల్ కోర్సులు క్లోజ్ అయిపోయే లోపు ఆయా ఉద్యోగాలు అందిస్తున్న సంస్థలతో ఇంటర్వ్యూలు కూడా ఈ సిబ్బంది నిర్వ‌హిస్తారు. ఉద్యోగాలు కూడా ఇప్పించేందుకు వీరు కృషి చేస్తారు. కాగా ఈ కోర్సు చేయ‌డానికి వయో పరిమితి కూడా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version