రూ.3 లక్షలు పెట్టి కొన్న భూమి విలువ కేటీఆర్ వల్ల ఇవాళ రూ. 6 కోట్లకు పెరిగింది.. నటుడు కేవీ ప్రదీప్

-

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ధరలు ఇవాళ కోట్లల్లో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే  సినీ నటుడు కే.వీ. ప్రదీప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ దగ్గర ఒక 500 గజాల స్థలం కొంటే.. నీలాంటి వారు ఎవ్వరో బలవంతం పెడితే.. నా లాంటి వాడు ఎవ్వడో రికమండ్ చేస్తే.. అబ్బా అనుకుంటూ.. తిట్టుకుంటూ కొనుక్కొని మొన్న అమెరికా వెళ్లి 20 ఏళ్ల తరువాత వచ్చి బావగారు అతను ఎవ్వరో శ్రీనివాస్ అంట.. రియల్ ఎస్టేట్ లో అమ్మాడు. ఆయన కనిపిస్తే.. నేనిప్పుడు సన్మానం చేసి ఆయనకు ఏమైనా లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నా అన్నాడు.

ఎందుకు అంటే.. అది ఆరోజు 3 లక్షలు పెట్టి కొన్నది.. ఇవాళ మూడు కోట్ల విలువ అయింది. కేటీఆర్ కూడా అందులో భాగమే. కేటీఆర్ చేసిన మంచి పనుల వల్లనే రియల్ ఎస్టేట్ ధర పెరిగింది. ముఖ్యంగా తెలంగాణను ఒక డెస్టినేషన్ ప్లేస్.. 10 మంది డెస్టినేషన్ ప్లేస్ చేశారు. ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ నార్త్ ఇండియా నుంచి వచ్చి రెండేల్ల పాటు ఉండి.. అక్కడి నుంచి బాంబే వెల్లి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ SBI లో అయి మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చేశాడు. నేను రిటైర్డ్ అయ్యానండి. హైదరాబాద్ ను మించిన డెస్టినేషన్ లేదు.. దేశంలోనే బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్పాడు. ఇది రావడానికి కారణం తెలంగాణ సాధించుకోవడం అని చెప్పుకొచ్చాడు నటుడు కే.వీ. ప్రదీప్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version