నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ క్రియేషన్‌ జాబ్స్, జీతం కోట్లల్లోనే

-

జాబ్‌లో ప్రజర్‌, టెన్షన్‌ కాకుండా… ఆడుతూ పాడుతూ చేసే ఉద్యోగాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌ అనే చెప్పాలి. వాళ్ల కష్టం వారికి ఉన్నా.. ఎంజాయ్‌మెంట్‌ కూడా ఉంటుంది. అలా చిల్‌ అవుతూ చేసే ఉద్యోగాలు మీరు చేయాలనుకుంటే.. నెట్‌ఫ్లిక్స్‌ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. కోట్లల్లో జీతం ఉంటుంది. ఇంతకీ ఆ జాబ్‌ ఏంటో చూద్దామా..!

నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ క్రియేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే ఇది AI మేనేజర్‌తో సహా వివిధ AI సంబంధిత స్థానాలకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. అందులోనూ మేనేజర్ పోస్టుకు భారీ మొత్తంలో జీతం ఇస్తామని ఆఫర్ చేసింది. AI మేనేజర్ పోస్టుకు 3 లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్ల వరకు జీతం ఇవ్వనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. 9 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో 7.38 కోట్లు.

ఏఐ మేనేజర్ పోస్టు మాత్రమే కాదు నెట్‌ఫ్లిక్స్‌లోని గేమింగ్ విభాగంలో ఏఐ టెక్నికల్ మేనేజర్, మరికొన్ని పోస్టుల కోసం, ఏఐకి సంబంధించిన అన్ని పోస్టులకు మంచి వేతనాన్ని అందించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. వినోద రంగంలో AI వినియోగాన్ని పెంచడం, AI సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించాలనే లక్ష్యంతో, నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ క్రియేట్ చేయడంలో వేగంగా పని చేసేందుకు ఏఐ తీసుకురావాలని ప్లాన్ చేసింది.

కోవిడ్(Covid) సమయంలో నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే కోవిడ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ దాదాపు 50 శాతం సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ షేర్ ధర కూడా భారీగా పడిపోయింది. కాస్ట్ కటింగ్, రిసెషన్ పేరుతో చాలా మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్. లాభాలను పెంచుకునేందుకు విధానాన్ని మార్చుకుంది. ఒక ఖాతానే చాలా మందే వాడే విధానంపై కూడా నెట్‌ఫ్లిక్స్ కండీషన్స్‌ పెట్టింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా వాడే వారి సంఖ్య తగ్గిపోయి, అలాంటి వారు నెట్‌ఫ్లిక్స్‌ని చూడాలంటే కొత్త ఖాతాలను తెరవాల్సి వస్తోంది. కంటెంట్ ఉత్పత్తిలో AI వినియోగాన్ని పెంచడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రణాళికపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. నిరసన తెలిపిన SGA, WGA, టెలివిజన్-రేడియో కళాకారులు నెట్‌ఫ్లిక్స్ ఈ చర్యను ఖండిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version