సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ పోస్టుల నియామకం కోసం అక్టోబర్ 27 న జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అయితే ఇంటర్వ్యూ కి ఎటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుగా తమ దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు అక్టోబర్ 25 లోపు నిర్దేశిత ఫార్మాట్‌లో పంపాలి.

ఈ ప్రక్రియ ద్వారా 1 మేసన్ పోస్ట్ , 1 సీవర్ మ్యాన్ పోస్ట్ నియామకం చేయబడుతుంది.అభ్యర్థులను రోజువారీ వేతనాలపై , పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. ఇది ఇలా ఉంటే అభ్యర్థి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలానే అనుభవం తప్పక ఉండాలి. అలానే అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

ఇది ఇలా ఉండగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. అవసరమైన పత్రాలను CRPF రిక్రూట్‌మెంట్ 2021 కొరకు అక్టోబర్ 25 లోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు పంపాలి. ఆ తర్వాత అభ్యర్థులు 31 బిలియన్, సిఆర్‌పిఎఫ్, మయూర్ విహార్, ఫేజ్ 3, న్యూఢిల్లీలో 27 అక్టోబర్ 2021 న ఉదయం 11:30 గంటలకు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇది ఇలా ఉంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 38 హెడ్ కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేస్తోంది. crpf.gov.in ద్వారా పూర్తి వివరాలని చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news