ఐబీపీఎస్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల!

-

బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఐబీపీఎస్‌ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఐబీపీఎస్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పటు చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియను జూన్‌ 8 నుంచి ప్రారంభమవ్వనుంది. చివరి తేదీ జూన్‌ 28. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలకు www.ibps.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌–ఎక్స్‌ (సీఆర్‌పీ) ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఖాళీల వివరాలు ఇలా

మొత్తం ఖాళీలు: 10,447
మల్టీపర్పస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ – 5096
ఆఫీసర్‌ స్కేల్‌–1 – 4,119
ఆఫీసర్‌ స్కేల్‌–2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) – 25
ఆఫీసర్‌ స్కేల్‌–2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) – 43
ఆఫీసర్‌ స్కేల్‌–2 (ట్రెజరీ మేనేజర్‌) – 10
ఆఫీసర్‌ స్కేల్‌–2 (లా) – 27
ఆఫీసర్‌ స్కేల్‌–2 (సీఏ) – 32
ఆఫీసర్‌ స్కేల్‌–2 (ఐటీ) – 59
ఆఫీసర్‌ స్కేల్‌–2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) – 905
ఆఫీసర్‌ స్కేల్‌– 3 – 151

అర్హతలు

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌ లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021
దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 28, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 గా ఖరారు చేశారు.
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021
మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్, 2021

 

Read more RELATED
Recommended to you

Latest news