మీరు బీటెక్ పూర్తి చేసారా..? లేదా ఆఖరి సంవత్సరం చదువుతున్నారా…? అయితే మీకు ఒక మంచి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-133) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇక దాని కోసం పూర్తి వివరాలని చూస్తే… బీటెక్ ప్యాస్ అయినవాళ్ళ నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది ఇండియన్ ఆర్మీ.
ఇక పోస్టుల వివరాలని చూస్తే… మొత్తం ఖాళీలు 40 ఉన్నాయి. సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ 11, ఆర్కిటెక్చర్ 1, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 4, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 9, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ 2, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, శాటిలైట్ కమ్యూనికేషన్ 1, ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్ 3, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ 1 మరియు
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ 1 ఉన్నాయి.
వయస్సు 2021 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు ఉండాలి. క్యాడెట్ ట్రైనింగ్ స్టైపెండ్ రూ.56,100. శిక్షణా కాలం 49 వారాలు. అప్లై చేయాలనుకునే వాళ్ళు ముందుగా https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఆ తరువాత Officers Entry Login ట్యాబ్ ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేసి, అన్ని వివరాలు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి. ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి.