Indian Navy Recruitment 2021: మొత్తం 1159 ఖాళీలు… టెన్త్ ప్యాస్ అయినవాళ్లు ఇలా అప్లై చెయ్యండి..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా ఇప్పుడే చూసి అప్లై చేసుకోండి.
కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించి షార్ట్ నోటీస్ రిలిజ్ చెయ్యగా…. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఇక వివరాల లోకి వెళితే… ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఇందులో 1159 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటిలో 710 పోస్టులు విశాఖపట్నం లో ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి వివరాలని https://www.joinindiannavy.gov.in/ లో క్లుప్తంగా చూడవచ్చు. సులువుగా వెబ్ సైట్ నుండి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2021 ఫిబ్రవరి 22న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యడానికి 2021 మార్చి 7 చివరి తేదీ. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్- INCET ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… 1159 ఖాళీలు ఉండగా అందులో హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్, విశాఖపట్నం- 710, హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నావల్ కమాండ్, ముంబై- 324, హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి- 125 వున్నాయి.

అప్లై చెయ్యాలంటే 10వ తరగతి పాస్ కావాలి. ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. అది ఎప్పుడనేది ఇంకా చెప్పలేదు. ఇక దరఖాస్తు ఫీజు విషయం లోకి వస్తే… రూ.205. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news