తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా పరిస్థితులు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కొండా సురేఖ సహకారం తీసుకుని రేవంత్ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.
రేవంత్ రెడ్డికి కొండా సురేఖ మినహా మరో నేత సమర్థవంతంగా తెలంగాణలో కనపడటం లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో విస్తృతంగా తిరిగేవారు. దీంతో ఆమెకు కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కొండా సురేఖ సహకారంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్చే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నారట.
దాదాపు 18 జిల్లాలకు చెందిన డిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన పాదయాత్రను హాజరయ్యారు. ఇప్పుడు వాళ్లు అందరితో రేవంత్ రెడ్డి సమావేశమై కొండా సురేఖ తో కలిసి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా పూర్తిస్థాయిలో సహకారం ఉండటంతో రేవంత్ రెడ్డి ఆమెను కలుపుకుని ముందుకు వెళ్తున్నారు.