DRDO జాబ్స్… 1061 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసారు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. DRDO ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్‌ 11 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ 33 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 215 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్) 123 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ 250 పోస్టులు వున్నాయి. అలానే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ హిందీ టైపింగ్ 12 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’ ఇంగ్లిష్ టైపింగ్ 134 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’హిందీ టైపింగ్ 04 పోస్టులు, సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు, వెహికల్ ఆపరేటర్ ‘ఎ’ 145 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’ 18 పోస్టులు, ఫైర్‌మ్యాన్ 86 పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక అర్హత వివరాలను చూస్తే.. పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చేసుండాలి. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు పక్కా ఉండాలి. ఇక వయస్సును చూస్తే..18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి.. రూ.100 గా వుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.దరఖాస్తులకు చివరితేది అక్టోబర్‌ 12, 2022. https://www.drdo.gov.in/ceptm-advertisement/1782 ద్వారా పూర్తి వివరాలను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news