గుడ్ న్యూస్: పోస్టాఫీసులో ఉద్యోగ అవకాశాలు…. పూర్తి వివరాలు ఇవే..!

-

నిరుద్యోగులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిల్ లోని ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు పోస్టల్ లో కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసారు.తెలుగు రాష్ట్రాల లో ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్ ‌లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.

ఈ నెల 26 లోగా అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. https://appost.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల్ని మాత్రమే స్వీకరిస్తోంది ఇండియా పోస్ట్ గమనించండి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు 2296, జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్ 947, ఓబీసీ- 507. అలానే ఈడబ్ల్యూఎస్ 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9. అలానే ఎస్సీ 279, ఎస్టీ 143 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుకి అప్లై చెయ్యాలంటే 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి. అలానే స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌, దివ్యాంగులకు ఫీజు లేదు. 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక జీతం అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000 లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news