హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజికవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఇక వాణీ దేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇక ఇదే స్థానానికి కాంగ్రెస్ నుండి చిన్నా రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి ఎల్ రమణ పోటీ చేస్తున్నారు. అయితే మరో పక్క రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేయనుండడంతో ఆయన గెలుపు ఖాయం అని అంటున్నారు. అందుకే కేసీఆర్ పీవీ కుమార్తెను రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది ఫలితాల విడుదల అనంతరం తేలనుంది.